Pawan Kalyan: కుంభస్థలాన్ని ఢీకొట్టి.. మదపుటేనుగుల్ని మట్టి కరిపించి
Pawan Kalyan: ఏంటీ.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రా? సర్లే.. ముందు ఎమ్మెల్యేగా గెలవమను అంటూ వెక్కిరించిన వారు ఎందరో. రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా గెలవలేని నీకెందుకు రాజకీయాలు? అంటూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారు మరెందరో. దశాబ్దాల కల.. కోట్ల మంది అభిమానుల స్వప్నం.. అనేక అవమానాలు,అవహేళనలు దాటుకుని.. అక్రమాలు,కుట్రలను ఛేదించుకొని.. కుంభస్థలాన్ని ఢీకొట్టి మదపుటేనుగుల్ని మట్టి కరిపించి.. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన మొదటిసారే క్యాబినెట్ మంత్రిగా పదవీ ప్రమాణం చేసారు జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రతీ జనసైనికుడు, ప్రతీ అభిమాని గుండె ఆనందంతో ఒప్పొగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.