Spiritual: దుర్యోదనుడి ఆలయం.. కల్లే నైవేధ్యం
Spiritual: ఎన్నో దేవుళ్ల ఆలయాల గురించి విన్నాం. కానీ మహాభారతంలో కీలక విలన్ అయిన దుర్యోదనుడికి ఓ ఆలయం ఉందని తెలుసా? ఈ ఆలయం గడ్సా ఓన్ కంట్రీగా పిలవబడే కేరళలో ఉంది.
కొల్లం జిల్లాలోని మలనాడ ప్రాంతంలో ఈ దుర్యోదనుడి ఆలయం ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే.. అందరి దేవుళ్లలాగా విగ్రహాలు ఏమీ ఉండవు. కేవలం దుర్యోదనుడు ఓ అరుగుపై తన పాదం పడినట్లు పూర్వీకులు చెప్పడంతో ఆ అరుగునే కొలుస్తున్నారు. పాండవులను వెతుక్కుంటూ దుర్యోదనుడు ఈ కేరళలోని మలనాడ గ్రామంలో ఉన్న అడవిలో సంచరించినట్లు పూర్వీకులు చెప్తున్నారు. దుర్యోదనుడికి ఈ మలనాడ అడవిలోని గిరిజన ప్రజలు సపర్యలు చేసారట. ఈ ఆలయంలో నైవేద్యంగా పండ్లు, ఆహార పదార్థాలు ఏమీ ఉండవు. కేవలం కల్లుని మాత్రమే నైవేధ్యంగా పెట్టి స్వీకరిస్తారు.
ఈ ఆలయంలో దుర్యోదనుడిని అప్పూప్పన్ అని పిలుస్తారు. అప్పూప్పన్ అంటే మలయాళంలో గాడ్ ఫాదర్ అని అర్థం. ఆలయంలోని పూజారి కురవ వర్గానికి చెందినవారు. సాధారణంగా ఆలయం ఏదైనప్పటికీ మంత్రాలు సంస్కృతంలోనే చదువుతారు. కానీ ఈ ఆలయంలో మాత్రం పూజారి మలయాళంలో మంత్రాలు చదువుతారు.