Hardik Pandya: IPL 2025లో పాండ్య‌పై నిషేధం

hardik pandya banned in ipl 2025

Hardik Pandya: ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఫెయిల్ అయిపోయాడు. పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐపీఎల్ నుంచి అవుట్ అయిపోయిన తొలి టీంగా ముంబై ఇండియ‌న్స్ నిలిచింది. దాంతో హార్దిక్ పాండ్య‌, రోహిత్ శ‌ర్మ ఎంతో ఆవేద‌న‌కు గుర‌య్యారు. అయితే ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్య‌పై నిషేధం విధించారు. 2025లో జ‌రిగే తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆడ‌లేడు. ఇందుకు కార‌ణం ఈ ఏడాది ఐపీఎల్‌లో పాండ్య త‌క్కువ ఓవ‌ర్ రేటుతో ఆడ‌ట‌మే. ముంబై ఇండియ‌న్స్ టీం ఐపీఎల్ నియ‌మావ‌ళిని అతిక్ర‌మించ‌డం ఇది మూడో సారి. 2025 ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ నుంచి తొల‌గించ‌డ‌మే కాకుండా రూ.30 ల‌క్ష‌లు జ‌రిమానా కూడా విధించారు.