Lifestyle: మాజీ ప్రియుడు కాబోయే మామగారని తెలిసి..
Lifestyle: అసలు ఎవ్వరికీ ఎదురవకూడని అనుభవం ఓ అమ్మాయికి ఎదురైంది. ప్రేమించినవాడు తనను తల్లిదండ్రులకు పరిచయం చేసేందుకు ఇంటికి తీసుకెళ్లగా.. తనకు కాబోయే మామగారే మాజీ ప్రియుడు అని తెలిస్తే..? ఇదే సంఘటన న్యూజిల్యాండ్‌కు చెందిన షీరీకి ఎదురైంది. ఈ విషయాన్ని ఓ రేడియో షోలో వెల్లడించింది.
“” నాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇలాంటి ఘటన ఎవ్వరికీ ఎదురుకాకూడదు. నేను ఒకతన్ని ప్రేమించాను. అతనితో మూడు నెలల పాటు డేటింగ్ చేసాక ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తానన్నాడు. మా పెళ్లికి వాళ్లు ఒప్పుకుంటారు అనే ఆశతో నేను వాళ్లింటికి వెళ్లాను. అక్కడికి వెళ్లాక నాకు షాకింగ్ ఘటన ఎదురైంది. నా ప్రియుడి తండ్రే నా మాజీ ప్రియుడు. అతనితో సెక్స్ కూడా చేసాను. మేం ఓ డేటింగ్ యాప్‌లో కలుసుకున్నాం.ఈ విషయాన్ని నేను నా ప్రియుడికి కూడా చెప్పలేకపోయాను “” అని వెల్లడించింది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం షీరీ చెప్పలేదు.