ఇన్‌స్టంట్ నూడుల్స్ తిని బాలుడి మృతి

boy dies after eating instant noodles

Viral News:  ఈ మ‌ధ్య‌కాలంలో మార్కెట్ల‌లో విరివిగా ల‌భిస్తున్న ఇన్‌స్టంట్ నూడుల్స్ తిని ఓ బాలుడు మృతిచెందాడు. ఆ ఇన్‌స్టంట్ నూడుల్స్ తిన్నాక ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగి చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని పిలిబీత్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడితో పాటు మ‌రో ఐదుగురు పిల్ల‌లు ఈ ఇన్‌స్టంట్ నూడ‌ల్స్ తిన్నార‌ట‌. తిన్నాక వారంతా వాంతులు చేసుకోవ‌డంతో వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈరోజు ఉద‌యం 12 ఏళ్ల బాలుడు మృతిచెంద‌గా మరో బాలుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మిగ‌తా న‌లుగురు పిల్ల‌లు కాస్త కోలుకున్నారు.

ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో అత్య‌ధిక వాట‌ర్ యాక్టివిటీ లెవెల్ ఉంటుంది. మైదా పిండి, గంజి, ఉప్పు వేసి ప్యాకేజింగ్ చేస్తారు. అవి పాడ‌వ‌కుండా ఉండేందుకు మోనోసోడియం గ్లూట‌మేట్ క‌లుపుతారు. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. దీని వ‌ల్ల ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. అందుకే ప్యాకేజ్డ్ ఫుడ్స్ పిల్ల‌ల‌కే కాదు పెద్ద‌ల‌కు కూడా మంచిది కాదు. ఆక‌లేస్తే ఓ పండు తిన‌డ‌మో లేదా క‌డుపు నిండా మంచినీళ్లు తాగ‌డ‌మో మంచిది కానీ ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటే మాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.