Sehwag: హార్దిక్, డేవిడ్‌కు ఆట రాదా? ముందే ఎందుకు బ్యాటింగ్ చేయలేదు?
Sehwag: మాజీ క్రికెటర్, కమెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్‌లపై మండిపడ్డారు. నిన్న జరిగిన కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (KKR vs MI) మ్యాచ్‌లో ముంబై మళ్లీ చిత్తుగా ఓడిపోయింది. ఆట మొదలైప్పుడు బాగానే ప్రదర్శించిన ముంబై.. చివర్లో గెలుపును కలకత్తా నైట్ రైడర్స్‌కు సమర్పించుకుంది.
ఇక ముంబై కథ ముగిసిపోయింది. 11 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లు ఓడిపోయి ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేని పరిస్థితి. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. అసలు హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్‌లు ముందే ఎందుకు బ్యాటింగ్ చేయలేదు అని మండిపడ్డారు. వారికి ఆడటం చేతకాదా? అంటూ విమర్శలు గుప్పించారు. హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్‌లు 7, 8 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్ చేసారో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థంకావడంలేదని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఆటగాళ్లను పిలిచి వారిని కఠినంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు.