Viral News: పాకిస్థానీ అమ్మాయికి భారతీయుడి గుండె
Viral News: గుండె సమస్యతో బాధపడుతున్న పాకిస్థానీ అమ్మాయికి భారతీయుడి గుండెను అమర్చి ప్రాణాలు కాపాడారు చెన్నైకి చెందిన వైద్యులు. ఈ సర్జరీని ఉచితంగా చేయడం మరో విశేషం. 19 ఏళ్ల ఆయేషా రాషన్ అనే పాకిస్థానీ యువతి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్న కోరికతో భారత్‌కు వచ్చింది. ఆమెకు చిన్నప్పటి నుంచే గుండె సమస్యలు ఉన్నాయి. సర్జరీ చేయించడానికి తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేకపోవడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ వైద్యులకు తన బాధను వివరించింది.
ఈ నేపథ్యంలో వైద్యులు మెడికల్ ట్రస్ట్ ద్వారా ఆ అమ్మాయికి ఉచితంగా సర్జరీ చేయాలనుకున్నారు. ఢిల్లీకి చెందిన యువకుడి గుండె అందుబాటులో ఉండడంతో వెంటనే సర్జరీ చేసి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడారు. ఈ సర్జరీ మొత్తం ఖర్చు రూ.33 లక్షలు మెడికల్ ట్రస్టే భరించిందని వైద్యులు తెలిపారు. అవయవ దానం, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలకు పెట్టింది పేరు చెన్నై అని మరోసారి వైద్యులు రుజువు చేసారు.
అయితే చెన్నై డాక్టర్లు ఈ సందర్భంగా వెల్లడించిన మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం ఉండి డబ్బుల్లేక చేయించుకోలేకపోతున్నవారికి ఇలా ఉచితంగా సాయం చేస్తే బాగుంటుందని.. అలా కాకుండా కొన్ని హాస్పిటల్‌లోని వైద్యులు అవయవాలను అమ్ముకోవడం.. లేదా పారేయడం వంటివి చేస్తున్నారని ఇలాంటి హాస్పిటల్స్‌పై నిఘా వేసి వాటి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసారు.