చంద్ర‌బాబుని న‌మ్మ‌కండి.. జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ షాకింగ్ కామెంట్స్

Narne Srinivas Rao: వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ‌గారు నార్నె శ్రీనివాస్‌రావు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై (Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేసారు. చంద్ర‌బాబు నాయుడుని ఎవ్వ‌రూ న‌మ్మొద్ద‌ని.. సొంత త‌మ్ముడి చేతులు కాళ్లు క‌ట్టేసి ఇంట్లో కూర్చోపెడుతున్నార‌ని.. చెల్లెలికి తిరుప‌తిలో యాక్సిడెంట్ అయ్యి చావుబ‌తుకుల మ‌ధ్య ఉంటే క‌నీసం ప‌ట్టించుకోని మ‌నిషి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తాడ‌ని ప్ర‌శ్నించారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో నార్నె శ్రీనివాస్‌రావు ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి చంద్ర‌బాబు నాయుడుకి వ్య‌తిరేకంగా కామెంట్స్ చేసారు. మ‌ళ్లీ ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆయ‌న్ను రంగంలోకి దింపి చంద్ర‌బాబు నాయుడుపై కామెంట్స్ చేయిస్తోంది.

ALSO READ:

AP Elections: వీడిన స‌స్పెన్స్.. చింత‌మ‌నేనికి చంద్ర‌బాబు ఫోన్

Jagan: నోరు జారితే చూస్తూ ఊరుకోం.. ఎన్నిక‌ల క‌మిష‌న్ హెచ్చ‌రిక‌