Summer Fashion: కూల్​ కూల్​ కుర్తీస్​!

సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే కాటన్​ దుస్తులు ధరించడానికే మొగ్గు చూపుతారు చాలామంది మహిళలు. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు, చెమట, వేడి తట్టుకుంటూ మిగతా దుస్తులను ధరించాలంటే కుదిరే పనికాదు. సిల్క్​, పట్టు, నైలాన్​, జీన్స్​ వంటివి చెమటను పీల్చుకోకపోగా చిరాకు కలిగిస్తాయి. అందుకే సమ్మర్​ అంటే కాటన్. ఈ కాటన్​​ దుస్తుల్లోనూ రకరకాల ఫ్యాషన్​ను మేళవించి రూపొందించిన కుర్తాలు, స్కర్టులు, ట్రౌజర్లు, టీ షర్టులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక మనదేశంలో కాటన్​ చీరలు ఎవర్​గ్రీన్. మరి ఈ కాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలో ఓ లుక్కేద్దాం..
* ఈ ఎండాకాలంలో ధరించే దుస్తులూ ఫాషన్ గాను మరియు సౌకర్యవంతంగాను ఉండాలి. ముఖ్యంగా సమ్మర్ లో మహిళలకు కాటన్ దుస్తులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సమ్మర్ లో సౌకర్యవంతంగా మరియు చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి ఇండియాలో తయారయ్యే కాటన్ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. ఇవి సమ్మర్ లో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
* ఈ కాలానికి సరిపోయే దుస్తులను రూపొందించేందుకు ఖాదీ అద్భుతమైన మెటీరియల్. ఖాదీతో తయారు చేసే చీరలు, సల్వార్ కమీజ్ మరియు షర్ట్ సమ్మర్ లో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సమ్మర్ లో అధిక వేడికి వదులుగా ఉండే దుస్తులు ధరించడం చాలా సౌకర్యవంతం. శరీరానికి హత్తుకొనే జీన్స్, టైట్ ప్యంట్స్ వంటివి సమ్మర్ వాతావరణానికి ఎంత మాత్రం సరిపడవు. కాబట్టి సమ్మర్ లో వదులు గా ఉండే లూజ్ ప్యాంట్స్ మరియు జోధ్ పురి ప్యాంట్స్ ధరించడం వల్ల కాళ్ళకు చల్లదనంతో పాటు, గాలి బాగా తగులుతుంది.
* సమ్మర్ ఫ్యాషన్ ఎప్పుడూ చాలా వైబ్రాంట్ గా మరియు బ్రైట్ గా ఉంటుంది. కాబట్టి సమ్మర్ లో మీకు సౌకర్యవంతంగా ఉంటూనే ఫ్యాషన్ టచ్ ఇచ్చే దుస్తులను ఎంపిక చేసుకోండి. సమ్మర్ లో హాట్ ప్యాంట్స్ ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సాధారణంగా ఇవి చాలా సులవుగా, సాగే గుణం కలిగి ఉంటాయి. సమ్మర్ లో వీటిని టీషర్ట్స్, షర్ట్స్ మీదకు వేసుకోవచ్చు.
* వేసవిలో చాలా సౌకర్యవంతంగా శరీరానికి చల్లదనాన్ని అందించే వాటిలో మహిళలకు చీరలకంటే సౌకర్యవంతం మరొకటి లేదనేది నిజం. కానీ అందరికీ చీరలు కట్టుకుని వాటిని మేనేజ్​ చేయడం రాదు. అలాంటి వాళ్లు కాటన్​ కుర్తీలు, టాప్​లు, పలాజోలు ధరించవచ్చు. వీటిలోనూ లేత రంగులు ఎంచుకోవడం మంచిది.
* పిల్లలకూ స్లీవ్​లెస్​ బనియన్స్​, కాటన్​ టాప్స్​, షార్ట్స్​ తొడగాలి. పిల్లల్ని ఎండలో తిరగకుండా చూడాలి. బయటకు వెళ్లినప్పుడు వదులుగా ఉండే బట్టలు వేయడం మంచిది.