Hanuman Jayanthi: ఈ ఒక్క మంత్రం జపిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయ్!
Hanuman Jayanthi: రేపే (April 23) హనుమాన్ జయంతి. పైగా పౌర్ణమి. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు.
సాధారణంగా తల్లి కడుపులో బిడ్డ 9 నెలలు మాత్రమే ఉంటాడు. కానీ హనుమంతుడు 12 ఏళ్లు తల్లి కడుపులో ఉన్నాడట. నిజానికి పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో పుట్టినట్లుగానే ఉంది కానీ చైత్ర మాసంలో పుట్టినట్లుగా లేదు. వైశాఖ మాసంలో శనివారం నాడు ఆంజనేయ స్వామి జన్మించారు. ఆంజనేయ స్వామి జన్మించిన ఆరు రోజుల తర్వాత గ్రహణం వచ్చింది. అమావాస్యకు ముందు కృష్ణపక్షంలో హనుమంతుడు జన్మించిన ఆరో రోజు ఆయన తల్లి అంజనా దేవి దర్బలు తీసుకురావడానికి బయటికి వెళ్లింది.
ఇంతలో బాలుడైన హనుమంతుడు నిద్ర లేస్తాడు. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో హనుమంతుడి సూర్య భగవానుడు పండులా కనిపిస్తాడు. అరె ఇదేదో బాగుందే అనుకుని ఎగురుకుంటూ వెళ్తాడు. గ్రహణం కావడంతో రాహువు సూర్యుడిని మింగాలని చూస్తుంటాడు. దాంతో హనుమంతుడు సూర్యుడిని పట్టుకోబోయి రాహువును పట్టుకుంటాడు. దాంతో రాహువు వదులు వదులు అంటూ అల్లాడిపోయాడట.
దాంతో ఎలాగోలా రాహువు ఇంద్రుడి వద్దకు వెళ్లి ఇలా ఆంజనేయుడు తన పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో చెప్తాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి హనువుపై (దవడపై) కొడతాడు. దాంతో నొప్పితో ఆంజనేయుడు కింద పడిపోతాడు. ఈ విషయం వాయు దేవుడికి తెలిసి కోపంతో ప్రపంచాన్ని స్తంభింపజేస్తాడు. దాంతో వెంటనే బ్రహ్మ దేవుడు కలగజేసుకుని ఆల్రెడీ శక్తిమంతుడైన ఆంజనేయ స్వామికి సకల దేవతల శక్తిని ప్రసాదించి పైకి లేపుతాడు.
ఇప్పుడు ఈ కథ ఏదైతే ఉందో ఈ వృత్తాంతాన్ని తలుచుకుంటేనే శని దోషాలు పోతాయి. హనుమాన్ జయంతి రోజున ఎవరైనా కూడా చేయాల్సింది రామ నామం. ఎక్కడైతే రామ నామం జపిస్తారో అక్కడ హనుమంతుడు ఉంటాడు. రామ నామం ఎక్కడైతే పలుకుతుందో అక్కడ హనుమంతుడు సంచరిస్తూ ఉంటాడు. హనుమాన్ జయంతి రోజున ఆయనకు సువర్చలా దేవితో కళ్యాణం చేస్తుంటారు. ఈ కళ్యాణం ఎవరైతే చేయించుకుంటారో వారికి కుజ దోషాలు పోతాయి. అంతేకాదు.. సింధూర లేపనంతో ఆంజనేయుడి విగ్రహాన్ని పూజిస్తే ఎంతో మంచిది.
ALSO READ:
రామాయణం తర్వాత హనుమంతుడు ఏమైపోయినట్లు?