శ‌నివారం రోజున పొర‌పాటున కూడా ఈ ప‌నులు చేయ‌కండి

Saturday: శ‌నివారం రోజున మ‌నం తెలిసో తెలీకో చేసే కొన్ని ప‌నులు శ‌ని దేవుడిని ఆగ్ర‌హాన్ని తెప్పిస్తాయ‌ట. అవేం ప‌నులంటే..

*ఐర‌న్, బొగ్గు, నూనె, ఉప్పు, చెక్క‌.. ఈ వ‌స్తువుల‌లో శ‌నివారం నాడు ఏది కొన్నా కూడా శ‌ని దేవుడు ఆగ్ర‌హిస్తాడు. చీపురు, పేప‌ర్, పెన్సిల్, న‌ల్ల బూట్లు కూడా కొనుగోలు చేయ‌కూడ‌దు.

*పాలు, పెరుగు, ఇత‌ర పాల ఉత్ప‌త్తుల‌ను తీసుకోకూడ‌ద‌ట‌. ఒక‌వేళ తీసుకోవాల‌నుకుంటే అందులో కాస్త బెల్లం లేదా ప‌సుపు వేసి తీసుకోవ‌చ్చ‌ట‌. మామిడికాయ ప‌చ్చ‌డి, వంకాయ‌, ఎర్ర క్యాప్సిక‌మ్ కూడా తిన‌కూడ‌ద‌ని అంటారు.

*శ‌నివారం రోజున మ‌ద్యానికి దూరంగా ఉంటే మంచిది. ఏలినాటి శ‌నితో బాధ‌ప‌డుతున్న‌వారు అస‌లు ముట్ట‌కూడ‌దు.

*అత్త‌గారింటికి కూడా వెళ్ల‌కూడ‌దు అంటారు. జుట్టు, గోళ్లు కూడా క‌త్తిరించ‌కూడ‌ద‌ట‌.

ALSO READ:

Lord Shani: శ‌నివారం ఈ మంత్రాలు చ‌దివితే మంచిది