CSK vs SRH: మ్యాచ్ పోవ‌డానికి కార‌ణం రుతునే..!

CSK vs SRH: నిన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings), స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కి (Sun Risers Hyderabad) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. చెన్నైకు వ‌రుస‌గా ఇది రెండో ఓట‌మి. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవ‌డానికి కార‌ణం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే అని మాజీ క్రికెట‌ర్లు మైఖెల్ వాగ‌న్, ఇర్ఫాన్ ప‌ఠాన్‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

ధోనీని ఇంకా ముందు పంప‌కుండా కేవ‌లం మూడు డెలివ‌రీలు ఉన్న‌ప్పుడే రుతు ధోనీని పంప‌డం ఏంటో ఇప్ప‌టికీ త‌మ‌కు అర్థంకావ‌డం లేద‌ని అన్నారు. ధోనీని ఉన్న‌త బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ఉంచ‌కుండా చివ‌ర్లో పంపిస్తే ఎలా అని రుతుని ప్ర‌శ్నించారు. ఓ ర‌కంగా రుతు తీసుకున్న ఈ నిర్ణ‌య‌మే చెన్నై ఓట‌మికి కార‌ణం అయ్యింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంకాస్త త్వ‌ర‌గా ధోనీ బ్యాటింగ్‌కి వ‌చ్చి ఉంటే భువ‌నేశ్వ‌ర్ కుమార్, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్‌ల‌ను ఇంకాస్త ధీటుగా ఎదుర్కోగ‌లిగేవాడ‌ని అన్నారు. ముందు ముందు మ్యాచ్‌ల‌లో రుతు ఇలాంటి పొరపాట్లు చేయ‌డ‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.