శని త్రయోదశి.. ఏం చేస్తే మంచిది?
Spiritual: శని త్రయోదశి అనేది.. శని భగవానుడి నుంచి విపత్తులను తొలగించుకోవడానికి, శని కర్మకారకుడు కాబట్టి మనం చేసిన పాప కర్మలను తొలగించుకోవడానికి విపత్తులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఈసారి శని త్రయోదశి ఏప్రిల్ 6న వచ్చింది. జాతకంలో శని దశ నడుస్తున్నటువంటి వారు, ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం ఉన్నవారు, జన్మ జాతకంలో జన్మ స్థానంలో శని ప్రభావంతో ఉన్నవారు శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేయాల్సిన క్రతువులు ఉన్నాయి. శనికి ఇష్టమైనవి పదార్థాలు ఉన్నాయి. నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నూనె, నల్ల వస్త్రం, నువ్వులతో చేసిన లడ్డూలు శని దేవుడికి ప్రీతికరమైనవి.
శని ప్రభావం.. కర్మ సరిగ్గా లేకపోయినా జీవితంలో ఏదైనా కలిసి రాకపోయినా అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, చీటికి మాటికి ప్రమాదాలు జరగడం, ఏదైనా గొడవలు జరగడం వంటివి జరుగుతున్నాయంటే శని పట్టుకుని పడిస్తున్నాడు అని అర్థం. శని ఎవరిని పట్టి పీడిస్తున్నాడు అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. శని జాతకంలో బాగాలేకపోయినా.. శని కర్మకారకుడు కాబట్టి చేసిన కర్మకు శిక్షను అనుభవించేలా చేస్తాడు. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే.. ఆర్థిక పరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే కచ్చితంగా వారిపై శని ప్రభావం ఉన్నట్లు అర్థం.
శని త్రయోదశి నాడు ఏం చేయాలి?
శని త్రయోదశి నాడు శని దేవుడికి ఇష్టమైనవి వండి నైవేద్యంగా పెట్టాలి. శని దేవుడిని పూజించడం ద్వారా యజ్ఞయాగాలు చేయడం ద్వారా శని ద్వారా మనకు కలుగుతున్నవి కొంత వరకు తొలగిపోతాయి. శనీశ్వరుడికి నిమ్మకాయలో దీపం పెడితే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. శని త్రయోదశి రోజున నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం, ఒక మేకు తీసుకుని నల్ల నువ్వుల్లో పెట్టి తాంబూలంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలాంటివి చేస్తే శని దోషం కొంత వరకు తొలగిపోయే అవకాశం ఉంది.