Kavitha Bail: “నీ కొడుకు ఒంటరి కాదు.. బెయిల్ అవసరం లేదు”
Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈరోజు ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌజ్ కోర్టులో వాదనలు జరిగాయి. కవితకు వ్యతిరేకంగా ఈడీ అధికారులు కోర్టులో తమ వాదనలు వినిపించారు.
తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కవిత కుమారుడు ఒంటరి వాడు కాదని.. తండ్రి ఉన్నాడని.. ఈ మాత్రం దానికి బెయిల్ అవసరం లేదని తెలిపారు. ఈ నెల 8న ఉదయం 10:30 గంటలకు తీర్పును ప్రకటిస్తామని వెల్లడించారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తంలో సౌత్ నుంచి పూర్తి ప్లాన్ కవితదే అని బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని బలంగా వాదనలు వినిపించారు. ఇరు వైపుల వాదోపవాదాలు విన్న న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేసారు.