Crime News: “రాత్రంతా ఉండి ముద్దిస్తే భవిష్యత్తు బాగుంటుంది”
Crime News: చదువు చెప్పాల్సిన గురువు విద్యార్ధులను లైంగికంగా మానసికంగా వేధించే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వెస్ట్ బెంగాల్‌లోని భీర్భుమ్ జిల్లాలో ఉన్న విశ్వ భారతి యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అబ్దుల్లా అనే వ్యక్తి.. ఆ యూనివర్సిటీలో చదువుతున్న ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ముగ్గురు విద్యార్ధినులను ఎక్కడ పడితే అక్కడ తాకడం, వాట్సాప్‌లలో అసభ్యకర మెసేజ్‌లు పంపుతుండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే రాత్రంతా తనతో ఉండి కౌగిలింతలు, ముద్దులు ఇవ్వాలని.. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితులు యూనివర్సిటీ యాజమాన్యానికి సమాచారం అందించినా వారు స్పందించకపోవడంతో నేరుగా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నిందితుడు అబ్దుల్లా స్పందిస్తూ.. తాను చాలా ఏళ్ల నుంచి ఈ కాలేజ్‌లో పనిచేస్తున్నానని.. ఎప్పుడూ ఎవ్వరికీ తప్పుడు మెసేజ్‌లు పంపడం.. తప్పుగా ప్రవర్తించడం వంటివి చేయలేదని అన్నాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేపడుతున్నారు.