CSK vs DC: కెప్టెన్ కాకపోయినా కిక్ ఇచ్చేసాడు..!
CSK vs DC: ఈసారి ఐపీఎల్ సీజన్లో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) నుంచి కెప్టెన్‌గా తప్పుకుని కోట్లాది మంది అభిమానుల మనసులను విరిచేసాడు. సరేలే కనీసం ధోనీ బ్యాటింగ్‌తో అయినా సరిపెట్టుకుందాం అనుకుంటే మొన్న ఆడిన మూడు ఆటల్లోనూ ధోనీ అసలు బ్యాటింగ్ చేయలేదు.
నిన్న రాత్రి జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో మాత్రం ధోనీ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టేసారు. ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేయడమే కాదు.. కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. 17వ ఓవర్లో మైదానంలో అడుగుపెట్టిన ధోనీ.. వరుసగా బౌండరీలతో దుమ్మురేపాడు. 300 డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. ఇంకొక్క ఓవర్ ఉండి ఉంటే మరో గెలుపు చెన్నై ఖాతాలో పడి ఉండేది. కానీ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి ఖాతా తెరిచింది.
అత్యధిక డిస్మిసల్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
కమ్రాన్ అక్మల్ -274
దినేశ్ కార్తిక్ – 274
క్వింటన్ డికాక్ – 270
జోస్ బట్లర్ – 209
ఇప్పుడు 300 చేసి ధోనీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా లేకపోయినా ఫ్యాన్స్‌కి మాత్రం ధోనీ ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నాడనే చెప్పాలి.