CSK vs GT: గుజరాత్‌కు భారీ టార్గెట్‌

CSK vs GT: IPL-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో దూబే 51, గైక్వాడ్ 46, రవీంద్ర 46, మిచెల్ 24 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్ తలో వికెట్ తీశారు.