Viral News: “అక్కడ” మొలిచిన వెంట్రుక.. కోమాలో వ్యక్తి
Viral News: మర్మాంగం భాగంలో లోపల నుంచి మొలిచిన వెంట్రుక ఓ వ్యక్తిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. ఇప్పుడు అతను బతికే ఛాన్స్ 4 శాతమే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘ36 ఏళ్ల స్టీవెన్ అనే వ్యక్తికి 2022లో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి. అసలు అతనికి ఏమైందో తెలీక వైద్యులు కూడా తలపట్టుకున్నారు. మెల్లిగా అతని ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తూ వచ్చిందంటే… సెప్సిస్ (శరీరం విషపూరితం అవ్వడం) వచ్చి అవయవాలు ఫెయిల్ అవుతూ వచ్చాయి. టన అమెరికాలో చోటుచేసుకుంది.
ఆ తర్వాత వైద్యలు అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడం మొదలుపెట్టారు. వైద్య పరీక్షల్లో భాగంగా వైద్యులకు ఒకటి అర్థమైంది. స్టీవెన్‌కు శరీరంలోని ఓ భాగంలో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది. ఈ గ్యాప్‌లో అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. చాలా పరీక్షలు నిర్వహించాక తెలిసిందేంటంటే.. స్టీవెన్ మర్మాంగం భాగంలో చర్మం లోపల ఓ వెంట్రుక మొలిచింది. ఆ చిన్న వెంట్రుక వల్లే స్టీవెన్ కోమాలోకి వెళ్లిపోయాడు. దాదాపు నెల రోజులుగా స్టీవెన్ కోమాలోనే ఉన్నాడు. అతను బతికే ఛాన్స్ 4 శాతమే ఉంది అనడంతో స్టీవెన్ సోదరి కన్నీరుమున్నీరవుతోంది. ఇప్పటికే క్రైడ్ ఫండింగ్ ద్వారా 8000 డాలర్ల వరకు సేకరించింది. ఇంత చేసినా తన సోదరుడు బతకడేమో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి స్టీవెన్ సోదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోండి అని నెటిజన్లకు సలహా ఇస్తోంది.