Vishwambhara: డూప్ లేకుండా..!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం విశ్వంభ‌ర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో త్రిష (Trisha) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మ‌ల్లిది వ‌శిష్ఠా సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరు బుర‌ద నీటిలో భారీ యాక్ష‌న్ సీన్ల‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. అయితే ఇందుకోసం చిరు డూప్ వ‌ద్ద‌ని తానే స్వ‌యంగా చేస్తాన‌ని అన్నార‌ట‌. ఈ సినిమాలో బుర‌ద నీటిలోని యాక్ష‌న్ స‌న్నివేశాలే హైలైట్‌గా నిల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.