Spiritual: గృహ యోగం క‌లగాలంటే ఏం చేయాలి?

Spiritual: సొంతిల్లు కోట్లాది మంది క‌ల‌. ఏమున్నా లేక‌పోయినా ఒక సొంత ఇల్లు ఉండాల‌ని కోరుకోని వారు ఉండరు. దాని కోస‌మే నిరంత‌రం కృషి చేస్తూ ఉంటారు. మ‌రి ఎంత క‌ష్ట‌ప‌డినా సొంతిల్లు కొనుక్కునే అవ‌కాశం రాక‌పోవ‌డం.. చేతిలో డ‌బ్బు కావాల్సిన డాక్యుమెంట్లు ఉన్నా అస‌లు సొంతిల్లు క‌ట్టుకోలేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉంటే ఏం చేయాలి?

ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఎక్క‌డో తిరిగేసి తిరిగి ఇంటికే చేర‌తాం. ఎవ‌రికైనా మొద‌టిగా ఉండాల్సింది వ‌స్త్రం, గృహం. మ‌రి గృహ‌యోగం ఎందుకు క‌ల‌గ‌డంలేదు అంటే గురువుల‌ను నిందించ‌డం వ‌ల్ల‌. అది ఈ జ‌న్మ‌లో చేసారా లేక పూర్వ జ‌న్మ‌లో చేసారా అనేది ముఖ్యం కాదు. ఏ జ‌న్మ‌లో అయినా స‌రే గురువుల‌ను నిందించి ఉంటే వారికి గృహ యోగం క‌ల‌గ‌దే అని శాస్త్రాలు చెప్తున్నాయి.

ఇల్లు అనేది భౌతికంగా క‌నిపించే వ‌స్తువు. కానీ అందులో ఉంటూ అనుభూతి చెందేది భౌతిక దేహం. అంటే మ‌న దేహం మ‌న ఆత్మ‌కు ఇల్లు లాంటిదే. ఇక్క‌డ మ‌నం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. గురు దోషం అనేది ఉండ‌కూడ‌దు. పంతుళ్ల‌ను చుల‌క‌న‌గా చూడ‌టం.. చ‌దువు నేర్పిన గురువును నోటికొచ్చిన కామెంట్స్ చేయ‌డం వంటివి అస్స‌లు చేయ‌కూడ‌దు. క‌ర్మ‌లు చేసుకుంటూ వెళ్తే ఆ క‌ర్మ‌ల‌కు ప్రాయ‌శ్చిత్తం జ‌ర‌గాలి. గురువుల‌నే కాదు త‌ల్లిదండ్రుల‌ను కూడా శ్ర‌ద్ధగా చూడాలి. మ‌రి గురువుల‌ను, త‌ల్లిదండ్రుల‌ను చుల‌క‌న‌గా చూసిన వారు ఎలాంటి ప్రాయ‌శ్చిత్తం చేసుకుంటే ఆ పాపం పోతుందంటే.. రావి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే క‌ర్మ ఫ‌లం త‌గ్గుతుంది.

రావి చెట్టు చుట్టూ 108 ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే మంచిది. ప్ర‌ద‌క్షిణ‌లు చేసే స‌మ‌యంలో మూల‌తో బ్ర‌హ్మ రూపాయ మ‌ధ్య‌తో విష్ణు రూపాయ అంత్యే శివ‌రూపాయ వృక్ష‌రాసాయ‌తే న‌మోన‌మః అనే మంత్రాన్ని జ‌పిస్తే త్వ‌ర‌గా గృహ‌యోగం క‌లుగుతుంద‌ట‌. ఇలా 108 రోజులు 108 సార్లు ఈ మంత్రాన్ని జ‌పిస్తూ రావి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే ఎంతో మంచిది.