Vijaya Sai Reddy: 2019లో జ‌రిగిందే రిపీట్ అవుద్ది..!

Vijaya Sai Reddy: తెలుగు దేశం (Telugu Desam Party), జ‌న‌సేన (Janasena) పార్టీల‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ (Bharatiya Janata Party) పొత్తుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో నిన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను క‌లిసారు. ఈరోజు కానీ రేపు కానీ పొత్తు గురించి సీట్ల గురించి అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఈ నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలుగు దేశం, జ‌న‌సేన‌ల‌తో క‌లవ‌డంపై స్పందించారు మంత్రి విజ‌యసాయి రెడ్డి. పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఏం లాభం.. మోసాలు, అబ‌ద్ధాలు మాత్రం అవే క‌దా..! 2014 నుంచి 2019 వ‌ర‌కు ఏం జ‌రిగిందో ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంది. జ‌స్ట్ ప్యాకేజింగ్ వేరు. ప్రొడ‌క్ట్ మాత్రం ఒక్క‌టే. మూడు కాళ్ల కుర్చీ ఎప్ప‌టికైనా కింద ప‌డాల్సిందే. స్థిర‌మైన ప్ర‌భుత్వానికే ఓటు వెయ్యండి. వైసీపీకి ఓటు వెయ్యండి అని ట్వీట్ చేసారు.

ALSO READ: TDP BJP Janasena: పొత్తు ఖ‌రారు.. ఎవ‌రికి ఎన్ని సీట్లంటే..!?