Ram Charan కు అవ‌మానం.. ఉపాస‌న మేక‌ప్ ఆర్టిస్ట్ వ్యాఖ్య‌లు

Ram Charan: మెగా పవ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. త‌న స‌తీమ‌ణి ఉపాస‌నతో (Upasana) క‌లిసి అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చెంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్‌ను చూడ‌గానే.. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మ‌ర్యాద‌పూర్వ‌కంగా వేడుక‌కు ఆహ్వానించారు. అయితే నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో భాగంగా చివ‌రి రోజు కావ‌డంతో బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్.. (Shahrukh Khan), స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan) ఆమిర్ ఖాన్‌ల‌తో (Aamir Khan) క‌లిసి స్టెప్పులేసారు.

అయితే ముందు షారుక్ ఖాన్ స్టేజ్‌పై డ్యాన్స్ వేయ‌డం మొద‌లుపెట్టాడు. అక్క‌డే ముందు వరుస‌లో కూర్చుని ఉన్న రామ్ చ‌ర‌ణ్‌ను కూడా స్టేజ్‌పైకి పిలిచి డ్యాన్స్ చేయించాల‌నుకున్నారు. అయితే షారుక్ రామ్ చ‌ర‌ణ్‌ను పేరు పెట్టి పిలవ‌కుండా.. ఓయ్ ఇడ్లీ వ‌డ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డున్నావ్ నువ్వు? అని అరిచారు. దాంతో అక్క‌డే ఉన్న ఉపాస‌న మేక‌ప్ ఆర్టిస్ట్ జీబా హ‌స‌న్ (Zeba Hassan) వేడుక నుంచి వాకౌట్ చేసారు. ఓ స్టార్.. మ‌రో స్టార్ న‌టుడికి ఇవ్వాల్సిన మ‌ర్యాద ఇదేనా అంటూ మండిప‌డ్డారు. ఇలాంటివి తాను స‌హించ‌లేనంటూ ఆ వేడుక నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాన‌ని జీబా హ‌స‌న్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. (Ram Charan)

అయితే దీనిపై నెటిజ‌న్ల నుంచి భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. షారుక్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చిన‌ప్పుడు కూడా నిల‌బ‌డి మ‌రీ ప‌ల‌క‌రించారని షారుక్ ఎప్పుడూ కూడా అలా అమ‌ర్యాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌ర‌ని అంటున్నారు. మ‌రోప‌క్క జీబా హాస‌న్ చెప్తున్న‌దంతా నిజ‌మే అని వీడియోను బ‌ట్టి తెలుస్తోంది. నిజంగానే షారుక్ ఖాన్ రామ్ చ‌ర‌ణ్‌ను స్టేజ్‌పైకి రమ్మ‌నేందుకు ఓయ్ ఇడ్లీ వ‌డ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డున్నావ్ నువ్వు? అని అన‌డం రికార్డ్ అయింది. ఈ అంశంపై ఉపాస‌న కానీ రామ్ చ‌ర‌ణ్ కానీ స్పందించలేదు. స‌హ‌జంగా వారు ఇలాంటి విష‌యాల‌కు స్పందించి త‌మను తాము త‌క్కువ చేసుకోవాల‌ని అనుకోరు. ఒక‌వేళ షారుక్ ఖాన్ నిజంగానే అలా ప్ర‌వ‌ర్తించి ఉంటే ఆయ‌నే స‌రిదిద్దుకోవాలి. షారుక్ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఇది మొదటిసారేం కాదు.

ALSO READ: Anant Radhika Wedding: మూడు రోజుల పెళ్లి.. ముచ్చ‌టైన‌ పెళ్లీ…!

షారుక్ ఖాన్ న‌టించిన‌ జ‌వాన్ ట్రైల‌ర్ రిలీజ్ స‌మ‌యంలో షారుక్.. డైరెక్ట‌ర్ అట్లీ గురించి అత‌ని భార్య ప్రియ గురించి కూడా ఇలాగే త‌ప్పుగా మాట్లాడారు. ట్రైల‌ర్ రిలీజ్ స‌మ‌యంలో షారుక్ మాట్లాడుతూ.. ప్రియ‌.. నేను నీ గురించి త‌ర్వాత మాట్లాడ‌తాను. మ‌నం క‌లిసి ఇంకో బిడ్డ‌ని ప్రొడ్యూస్ చేద్దాం. సారీ అదే.. నువ్వు అట్లీ ఇంకో బిడ్డ‌ను ప్రొడ్యూస్ చేయండి.. అని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాట‌లు ఎవ్వ‌రితోనూ ఎప్పుడూ మాట్లాడ‌కూడ‌దు.

అందులోనూ ప‌బ్లిక్‌గా స్టేజ్ ఎక్కి మ‌రీ ఇలా వేరొక‌రి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు అస‌లు ప్ర‌స్తావించ‌కూడ‌దు. షారుక్ చేసిన కామెంట్స్‌కి ప్రియ‌, అట్లీ త‌ప్ప‌కుండా ఇబ్బందిప‌డి ఉంటారు. కానీ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఏమ‌న్నా అంటే జోక్‌గా అన్నాను.. సీరియ‌స్‌గా తీసుకోకండి అంటారు. ఇలాంటి కామెంట్స్ చేసిన‌ప్పుడు ప‌ర్స‌న‌ల్‌గా అయినా ఇలా ఇంకెప్పుడూ చేయ‌కండి అని చెప్ప‌డానికి కూడా వారు సందేహించి ఉంటారు. అయినా ఈ బాలీవుడ్ వాళ్లకి ఇలాంటి కొత్తేం కాదు. జోక్ జోక్ అంటూనే ప‌క్క‌వారి ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను న‌లుగురిలో బ‌య‌ట‌పెట్టేస్తారు. ఏం మ‌నుషులో ఏంటో..!