AP Elections: ఆ 24 సీట్ల‌లోనూ TDP మ‌నుషులేనా?

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీ అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు (Pawan Kalyan) ఈరోజు త‌మ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తొలి జాబితాలో భాగంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) 94 మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌సేన (Janasena) 24 మందిని ప్ర‌క‌టించింది. అయితే ఆ 24 సీట్ల‌లో కూడా జ‌న‌సేన అభ్య‌ర్ధులు కాకుండా తెలుగు దేశం పార్టీకి చెందిన వారే పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని అన్నారు ఏపీ ప్ర‌భుత్వ విప్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy).

చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న ఎత్తులు క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. ఓ ప‌క్క భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌న్న ఆత్రం. ఇంకోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సీట్లు ఇవ్వ‌కుండా మింగేసే ప‌నులు. ఈ ర‌కంగా చూస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత పార్టీతో ఎన్నిక‌ల్లో పోటీ చేసే బ‌దులు తెలుగు దేశం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడి పాత్ర‌ను పోషిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. అయితే అలా చేస్తే.. చంద్ర‌బాబు నాయుడు ఆశించిన‌ట్లు ఓట్లు రావు అనుకున్నారేమో తెలీదు కానీ అందుకోసం ఆ అవుట్‌ఫిట్ అలాగే ఉంచి ఈ డ్రామా ఆడుతున్నారు. పేరు భార‌తీయ జ‌న‌తా పార్టీ వస్తే 24 సీట్ల నుంచే ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తారేమో. ఏది చేసినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ పోటీ చేస్తున్నాడో చెప్పుకోలేని పరిస్థితి. ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుని ఉంటే ఎక్క‌డ పోటీ చేస్తాడో చెప్పేవాడు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అది కూడా చంద్ర‌బాబు నాయుడు అన్ని ఈక్వేష‌న్స్ చూసి ఎక్క‌డ పోటీ చేయ‌మంటే అక్క‌డ చేస్తాడేమో. (AP Elections)

ALSO READ: TDP Janasena: 24 సీట్ల‌లో జ‌న‌సేన‌.. మిగిలిన‌వాటిలో TDP

మిగిలిన సీట్లు చంద్ర‌బాబు నాయుడు డిసైడ్ చేయాలి. జ‌న‌సేన‌కు కూడా సీట్లు ఈయ‌నే ఇవ్వాలి. 2014లో ఎన్నిక‌ల‌కు మేం మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. రాజ‌కీయ పార్టీకి విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన నాయ‌కుడు ఉంటే ఆ పార్టీ ప‌నితీరు బాగుంటుంది. మేం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 175 మందిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) పెట్టారు. తెలంగాణ‌లో ఎక్క‌డైతే మేం వ‌ద్ద‌నుకున్నామో అక్క‌డ త‌ప్ప మిగ‌తా చోట్ల గెలుచుకున్నాం. ఒక పార్టీ ఎలా ఉండాలి అనేది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చూపిస్తే.. ఒక అవుట్ ఫిట్ ఏదో పెట్టుకుని రాజ‌కీయ పార్టీ అని చంద్ర‌బాబు నాయుడు చెప్తున్నారు. ఇంత ద‌రిద్రంగా ఇలా కూడా ఉంటారా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూస్తే తెలుస్తోంది.

ఒక పార్టీ ప‌నితీరు ఏర్పాటు చేసుకోవ‌డానికి.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక ఇన్‌ఛార్జిని పెట్టుకునే ప్ర‌య‌త్నం కానీ.. పార్టీ త‌ర‌ఫున క‌మిటీలు వేయ‌డం కానీ చేయ‌లేదు. ఎందుకంటే డిమాండ్ పెరిగి చంద్ర‌బాబు నాయుడుకు ఎక్క‌డ‌ ఇబ్బంది క‌లుగుతుందో అని ప‌వ‌న్ అలా చేయ‌లేదు. అందుకే జ‌స్ట్ పార్టీ పేరు దానికి ఒక‌ గాజు గ్లాసు గుర్తు పెట్టుకున్నాడు. 100 శాతం రాయితీ కింద జ‌న‌సేన‌కు సీట్లు చంద్ర‌బాబు నాయుడు డిసైడ్ చేస్తారు. ఇక్క‌డ‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ఆశ పెట్టుకుని క‌ల‌లు కంటున్న వారు ఎవ‌రైనా ఉంటే వారి ప‌రిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. ఇప్ప‌టిక‌న్నా క‌ళ్లు తెరిస్తే బాగుంటుంది. ఇంత‌వ‌ర‌కు చంద్ర‌బాబు నాయుడు 175 స్థానాల్లో అభ్య‌ర్ధుల‌ను డిక్లేర్ చేయ‌లేక‌పోవ‌డం.. అందులో జ‌న‌సేన‌కు 24 స్థానాలు ఇవ్వ‌డం.. ఆ 24 స్థానాల్లో కూడా తెలుగు దేశం పార్టీకి చెందిన‌వారే ఉంటార‌నిపిస్తోంది. మాస్ట‌ర్ ప్లానింగ్ చంద్ర‌బాబు నాయుడే చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీని న‌డిపే ల‌క్ష‌ణాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు లేవు. అది చూసిన వారికి ఎవ‌రికైనా క్లియ‌ర్‌గా తెలుస్తుంది. అత్యంత ద‌య‌నీయ స్థితిలో ప‌వ‌న్ ఉన్నారు అని స‌జ్జ‌ల షాకింగ్ కామెంట్స్ చేసారు.