Mahesh Babu: మార్చి నుంచి ఇన్‌కాగ్నిటో మోడ్‌లోకి..!

Mahesh Babu: గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో 2024ని మొద‌లుపెట్టేసారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. బ్లాక్ బ‌స్ట‌ర్ అని కాదు కానీ ఫ‌ర్వాలేదు బాగానే ఆడింద‌ని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో త్రివిక్ర‌మ్ మార్క్ మిస్స‌యిందని ఫ్యాన్స్ కూడా బాధ‌ప‌డ్డారు. ఏం ఫ‌ర్వాలేదు.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న SSMB 29 సినిమాతో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్ట‌డానికి రెడీ అయిపోయారు మ‌హేష్. ఇప్పుడు మ‌హేష్ ఫోక‌స్ అంతా ఈ సినిమా పైనే ఉంది. (Mahesh Babu)

ALSO READ: SSMB 29: రెండు అదిరిపోయే టైటిల్స్..!

ఈ సినిమా కోసమే మ‌హేష్ ఇన్‌కాగ్నిటో మోడ్‌లోకి వెళ్లిపోతున్నార‌ట‌. అంటే.. మార్చి నెల నుంచి మ‌హేష్ ఒక మూడేళ్ల పాటు క‌నిపించ‌రు. ఎందుకంటే SSMB 29 సినిమాలో మ‌హేష్ ఎప్పుడూ క‌నిపించ‌ని లుక్‌లో ద‌ర్శ‌నమివ్వ‌బోతున్నారు. ఆ లుక్‌ను సినిమా ఫ‌స్ట్‌లుక్ కంటే ముందే బ‌య‌టికి రాకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఏ లుక్‌లో అయితే మ‌హేష్ క‌నిపించ‌బోతున్నారో ఆ లుక్ రావ‌డానికి ఎంతైనా ఒక మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని టాక్. ఈ నెల‌లో మ‌హేష్ ఒక యాడ్ ఫిలింలో న‌టిస్తారు. ఆ త‌ర్వాత నుంచి నో యాడ్స్, నో ఫోటో షూట్స్.

రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ నుంచి మొద‌లవుతుంది. ఇక ఈ సినిమా ఒక గ్లోబల్ అడ్వెంచ‌ర్‌లా ఉండ‌బోతోంద‌ని ఆల్రెడీ హైప్ పెంచేసారు రాజ‌మౌళి. ఇందులో హాలీవుడ్ న‌టుడు కూడా యాక్ట్ చేయ‌బోతున్నాడ‌ని అన్నారు. అయితే ఎవ‌రా హాలీవుడ్ న‌టుడు అనే వివ‌రాలు మాత్రం వెల్లడించ‌లేదు. అయితే ఏది ఏమైనా ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌న్న క‌సితో ఉన్నారు రాజ‌మౌళి. అదీకాకుండా ఇప్పుడు మ‌హేష్ బాబుకు గ్లోబ‌ల్ హిట్ ఎంతో అవ‌స‌రం.

ALSO READ: SSMB 29 బ‌డ్జెట్ ఎంతో తెలుసా?

ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు త‌మ స‌త్తా ఏంటో ప్యాన్ ఇండియాకి చూపించేసారు. ఇప్పుడు టాలీవుడ్‌లో హాలీవుడ్ హీరో అనిపించుకున్న మ‌హేష్ బాబు స‌త్తా ఏంటో కూడా ప్ర‌పంచానికి తెలియాల్సి ఉంది. అది రాజ‌మౌళి చేతిలోనే ఉంది. అందుకే సినిమాకు సంబంధించిన ఎలాంటి రిస్క్ తీసుకోద‌లుచుకోలేదు. RRR వ‌ర‌కు ప‌నిచేసిన టెక్నిక‌ల్ టీంలోని కొంద‌రు వ్యక్తుల‌ను కూడా రాజ‌మౌళి ప‌క్క‌న పెట్టేసారు. వారి స్థానంలో వేరొక‌రిని నియ‌మించుకున్నారు.

ఇక సినిమాలో మ‌హేష్ బాబు క్యారెక్ట‌ర్ హ‌నుమంతుడిని పోలి ఉంటుంద‌ని అంటున్నారు. రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పురాణాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి మ‌హేష్ కోసం ఓ క్యారెక్ట‌ర్ డిజైన్ చేసారు జ‌క్క‌న్న‌. భార‌త సంప్ర‌దాయాల‌కు ఈ సినిమా ద‌గ్గ‌ర‌గా ఉండ‌బోతోంది. సినిమా ఆఫ్రిక‌న్ జంగిల్ అడ్వెంచ‌ర్ ఆధారంగా ఉండ‌బోతోంది కాబ‌ట్టి డ్రామా, ఫైట్స్‌కి అస‌లు కొద‌వే ఉండ‌దు అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ (Vijayendra Prasad) కూడా క‌న్ఫామ్ చేసేసారు. ఇందులో హాలీవుడ్ న‌టుడు కూడా యాక్ట్ చేయ‌బోతున్నాడ‌ని అన్నారు. అయితే ఎవ‌రా హాలీవుడ్ న‌టుడు అనే వివ‌రాలు మాత్రం వెల్లడించ‌లేదు. హాలీవుడ్ న‌టుడు మ‌హేష్ బాబు సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదుగా..!

RRRని మించిపోతుంది..!

అయితే ఈ సినిమా RRRను మించి బిగ్గెస్ట్ సినిమా అవుతుంద‌న్న టాక్ కూడా న‌డుస్తోంది. ఏద‌న్నా సినిమా స్టార్ట్ చేసేముందు జ‌క్క‌న్న‌ ఆ సినిమాలోని హీరోతో వ‌ర్క్ షాప్స్ చేయిస్తారు. ఆ వ‌ర్క్ షాప్‌ని బ‌ట్టే ఆ హీరో సినిమాలో చేయ‌గ‌లుగుతాడా లేదా అని నిర్ణ‌యిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది జ‌క్క‌న్న ఆడిష‌న్ స్టైల్‌. ఈ వ‌ర్క్ షాప్స్‌లో మ‌హేష్ బాబు నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు. రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పురాణాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి మ‌హేష్ కోసం ఓ క్యారెక్ట‌ర్ డిజైన్ చేసారు జ‌క్క‌న్న‌. భార‌త సంప్ర‌దాయాల‌కు ఈ సినిమా ద‌గ్గ‌ర‌గా ఉండ‌బోతోంది. సినిమా ఆఫ్రిక‌న్ జంగిల్ అడ్వెంచ‌ర్ ఆధారంగా ఉండ‌బోతోంది కాబ‌ట్టి డ్రామా, ఫైట్స్‌కి అస‌లు కొద‌వే ఉండ‌దు..!