Devara: వామ్మో.. మ‌ళ్లీ ఆ రోజే రిలీజ్..!

Devara: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (JR NTR) న‌టిస్తున్న దేవ‌ర సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. కొన్ని కారణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే ఈరోజు కొత్త రిలీజ్ డేట్‌తో కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. సినిమాను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న రిలీజ్ చేయ‌నున్నారు. కొత్త రిలీజ్ డేట్ చూడగానే అప్ప‌టి దాకా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్న ఫ్యాన్స్ డీలా ప‌డిపోయారు. ఎందుకో తెలుసా?

2013లో తార‌క్ న‌టించిన రామ‌య్యా వ‌స్తావ‌య్య సినిమా కూడా ఇదే తేదీన రిలీజ్ అయింది. సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా మారింది. ఇప్పుడు అదే తేదీన దేవ‌ర వ‌స్తుండ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఈ తేదీని ఎంత వ‌ద్ద‌నుకున్నా ద‌రిద్రం చుట్టుకున్న‌ట్లు ప‌ట్టుకుంది అంటూ మండిప‌డుతున్నారు. మ‌రో తేదీన సినిమా రిలీజ్ చేయొచ్చు క‌దా అని దేవ‌ర టీంకు రిక్వెస్ట్‌లు పంపుతున్నారు.