KL Rahul: రాహులో రాహులా..!
KL Rahul: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు (England Test Series) ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ (Virat Kohli), శ్రేయస్ అయ్యర్‌లు (Shreyas Iyer) ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమైన రాహుల్.. మూడో టెస్టుకు కూడా బరిలోకి దిగడం లేదని BCCI తెలిపింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. (KL Rahul)
కాగా, ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టును రెండ్రోజుల కింద ప్రకటించింది బీసీసీఐ. జట్టును ప్రకటించే సమయంలోనే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుందని సెలెక్టర్లు చెప్పారు. కానీ, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని మూడో టెస్టుకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు అనంతరం వైజాగ్ మ్యాచ్‌కు దూరమైన రాహుల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందాడు.
దీంతో మిగిలిన మూడు టెస్టుల కోసం సెలెక్షన్ కమిటీ రాహుల్‌ను ఎంపిక చేసింది. అయితే మ్యాచ్ ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా.. రాహుల్ 90 శాతం మాత్రమే కోలుకోవడంతో అతడిని తప్పించారు. దీంతో రాజ్‌కోట్ టెస్టుకు రాహుల్ దూరమయ్యాడు.
ప్రస్తుతం 90 శాతం కోలుకున్న అతడిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నది’ అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్లు పుజారా, రహానే జట్టుకు దూరం కాగా.. కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మిగిలిన మూడు మ్యాచ్‌లకు ఎంపిక కాలేదు. ఇప్పుడు రాహుల్ కూడా లేకపోవడంతో.. మిడిలార్డర్‌లో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్, తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ స్థానంలో మూడు టెస్టులో ధ్రువ్ జురెల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్ స్థానంలో కర్ణాటక బ్యాటర్, రంజీల్లో అదరగొడుతున్న దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రవీంద్ర జడేజా మాత్రం ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం.ఇటీవల దేశవాళీ టోర్నీల్లో దేవ్‌దత్ పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. 23 ఏళ్ల పడిక్కల్ రెండు రోజుల క్రితం తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 151 పరుగులు చేశాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలు స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా 105 పరుగులు చేశాడు.
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో రజత్ పటీదార్ డెబ్యూ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టు ద్వారా సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది.
మూడో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, దేవ్‌దత్ పడిక్కల్.