EXCLUSIVE: జ‌న‌సేన ప్లాన్ B ఇదేనా?

EXCLUSIVE: తెలుగు దేశం పార్టీతో (TDP) పొత్తు పెట్టుకుని ఏపీ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్న జ‌న‌సేన‌కు (janasena) ప్లాన్ B ఏదైనా ఉందా? ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. పొత్తు ధ‌ర్మం పాటించ‌కుండా తెలుగు దేశం పార్టీ పోటీ చేయ‌నున్న సీటు పేరు బ‌య‌టికి చెప్పేయ‌డంతో జ‌న‌సేన కూడా రాజోలు, రాజాన‌గ‌రం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌కటించేసింది. దాంతో ఈ రెండు పార్టీల్లో ముస‌లం మొద‌లైంది.

మొన్న‌టివ‌ర‌కు ప‌వ‌ర్ షేరింగ్, సీట్ షేరింగ్ గురించి మాత్రమే జ‌న‌సేన తెలుగు దేశంతో చ‌ర్చించింది. ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయనతో సహా వారందరూ కోరుకొంటున్నారు. ఇలా జ‌ర‌గాలంటే ప‌వన్ మ‌ళ్లీ BJPతోనే పొత్తు పెట్టుకోవాలి. తెలుగు దేశంతో పూర్తిగా తెగ‌దెంపులు చేసుకోవాలి.

ఢిల్లీకి ప‌వ‌న్

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో ప‌వ‌న్ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. కేంద్ర‌మంత్రి జేపీ న‌డ్డాను (jp nadda) ఆయ‌న క‌ల‌వ‌నున్నారు. త్వ‌ర‌గా త‌మతో చేతులు క‌లిపితే సీట్ల షేరింగ్‌పై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని.. లేదంటే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇలాగే కొన‌సాగుతూ ఉంటుంద‌ని చర్చించ‌నున్నార‌ట‌. త్వ‌ర‌గా సీట్ల షేరింగ్ అంశం ఓ కొలిక్కి వ‌స్తే మెల్లిగా ప్ర‌చారాలు మొద‌లుపెట్టుకోవ‌చ్చ‌ని ప‌వ‌న్ అభిప్రాయం.