OG: పాట పాడ‌నున్న హంగ్రీ చీతా..!

OG: సుజీత్ (sujeeth) డైరెక్ష‌న్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  (pawan kalyan) న‌టిస్తున్న ఓజీ సినిమాలో ప‌వన్ మ‌రోసారి త‌న గాత్రంతో అల‌రించ‌నున్నారు. అత్తారింటికి దారేది, అజ్ఞాత‌వాసి సినిమాల్లో పాట‌లు పాడిన ప‌వ‌న్.. ఇప్పుడు ఓజీలోనూ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాట పాడ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఓజీ టీజ‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రాఠీలో డైలాగులు చెప్తూ గూస్‌బంప్స్ తెప్పించేసారు. ఇప్పుడు అదే మ‌రాఠీ డైలాగులు చెప్తూ పాట పాడితే ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఇమాజినేష‌న్‌కే వ‌దిలేసారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్. సాంగ్ హిట్ అయితే అదే హ్యాపీ.