Viral News: తల్లిదండ్రులపై కేసు వేసిన బాలుడు.. ఎందుకో తెలుసా?
Viral News: ఓ బాలుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడమే కాకుండా ఏకంగా తల్లిదండ్రులపై కేసు వేసాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ బాలుడు ఎందుకు ఇలా చేసాడో తెలుసా?
స్కూల్ నుంచి వచ్చాక తల్లిదండ్రులు ట్యూషన్‌కి వెళ్లమని రోజూ ఒత్తిడికి గురిచేస్తున్నారట. వారి బాధ భరించలేక ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు. తను బాగానే చదువుతానని.. స్కూల్లో మంచి గ్రేడ్స్ కూడా తెచ్చుకుంటున్నానని అలాంటప్పుడు తనకు ఎక్స్ట్రా క్లాసులు ఎందుకు అని పోలీసులకు తన బాధను చెప్పుకున్నాడు. దాంతో పోలీసులు కూడా షాకయ్యారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.