Spiritual: ఈ పనులు మిమ్మల్ని డబ్బుకి దూరం చేస్తాయి
Spiritual: ఎంత సంపాదిస్తున్నా చేతిలో డబ్బు నిలవదు. పైకి మాత్రం బాగానే సంపాదిస్తున్నాం డబ్బు అంతా ఎక్కడికిపోతోంది అని ప్రశ్నించుకునేవారు చాలా మంది ఉంటారు. కొన్ని వాస్తుకి వ్యతిరేకంగా చేసే పనులు కూడా డబ్బుని మన నుంచి దూరం చేస్తాయి. ఆ పనులేంటో వాటిని ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం.
*అవసరం లేకపోయినా కొందరు వృథా ఖర్చులు చేస్తుంటారు. అవసరంలో ఉన్నప్పుడు ఖర్చు చేస్తే దానికి ఓ విలువ, అర్థం ఉంటుంది. అవసరం లేకపోయినా డబ్బు వృథా చేస్తే లక్ష్మీదేవికి మీరు విలువ ఇవ్వనట్లే అని గుర్తుంచుకోండి.
*ఇంట్లో నైరుతి దిక్కు ఎంతో కీలకం. ఈ దిక్కుని పట్టించుకోకుండా.. శుభ్రం చేయకుండా వదిలేసినా కూడా లక్ష్మీ దేవి ఇంట నిలవదు అని వాస్తు శాస్త్రం చెప్తోంది.
*వాస్తుకి తగ్గట్టు వంటిల్లు డిజైన్ చేసుకోకపోయినా ఆర్థిక సమస్యలు వస్తాయట. మీ ఇంటి పత్రాలు ఆగ్నేయ దిశలో పెట్టడం కూడా మంచిది కాదు.
*ఇంట్లో నీళ్లు లీక్ అవుతున్నాయంటే ఆ ఇంట ఆర్థికంగా ఎప్పుడూ కష్టాలే ఉంటాయని గుర్తుంచుకోండి. ఇంట్లో ప్రతి మూలల్లో చూసి ఎక్కడైనా నీళ్లు పోతుంటే వెంటనే దానిని సరిచేయించుకోండి.
*మీ ఇంటి వాస్తు ప్రకారం మీరు పని చేసుకునే ప్రదేశం ఏ వైపున ఉండాలో వాస్తు నిపుణులను అడిగి తెలుసుకోండి.