Health: గ‌ర్భిణులు ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే పిల్ల‌ల‌కు మాట‌లు రావా?

Health: గ‌ర్భిణులు కొన్ని ర‌కాల మందులు వాడేట‌ప్పుడు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. త‌ల‌నొప్పి ట్యాబ్లెట్ వేసుకోవాల‌న్నా కూడా వైద్యులను సంప్ర‌దించడం ఎంతో మంచిది. తెలిసిన మాత్రే క‌దా వేసుకుంటే ఏమ‌వుతుంది అని నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే బిడ్డ‌కు ప్ర‌మాదం వాటిల్ల‌చ్చు. అయితే కొన్ని ర‌కాల పారాసెట‌మాల్ వేసుకుంటే పిల్ల‌లు పుట్టాక వారికి మాతృ భాష‌, మాట‌లు స‌రిగ్గా రావ‌ని హెచ్చ‌రిస్తున్నారు వైద్యులు.

ముఖ్యంగా అసీటామైనోఫెన్ అనే పారాసెట‌మాల్ వేసుకుంటే పుట్ట‌బోయే పిల్ల‌ల్లో మాతృ భాష‌ను నేర్చుకోలేక‌పోవ‌డం, సరిగ్గా మాటలు రాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు క‌నిపిస్తాయ‌ట‌. ఈ అసీటామైనోఫెన్ అనే ట్యాబ్లెట్‌ను ఎక్కువ‌గా త‌ల‌నొప్పి, జ్వ‌రం త‌గ్గ‌డానికి వేసుకుంటారు. ఈ ట్యాబ్లెట్ వేసుకోవ‌డానికి డాక్ట‌ర్ నుంచి ర‌సీదు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మెడిక‌ల్ షాపుల్లో అడిగితే ఇచ్చేస్తారు. గ‌ర్భిణులు ఈ మాత్ర‌కు దూరంగా ఉండాలి.