AP Elections: “వద్దమ్మా.. వదిలేయ్”
AP Elections: చెల్లెలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. ఓటు బ్యాంక్ చీలే అవకాశం క్లియర్గా ఉంది. ఇక తగ్గక తప్పదు. నచ్చజెప్పక తప్పదు. కానీ నా అంతట నేను వెళ్లలేను. అమ్మతో చెప్పించలేను. ఏం చేయాలి? బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దింపుదాం. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) మైండ్లో సరిగ్గా ఇదే రన్ అయ్యింది. అందుకే షర్మిళ వద్దకు సుబ్బారెడ్డి (yv subba reddy) ద్వారా రాయబారాన్ని పంపారు.
ఏపీలో జగన్కు వ్యతిరేకంగా పోటీ చేసి ఓటు బ్యాంక్ చీలితో అది కుటుంబంలో ఎవ్వరికీ మంచిది కాదని సుబ్బారెడ్డి షర్మిళకు నచ్చజెప్పాలని చూసారు. కానీ గతంలో తనకు జరిగిన గాయాన్ని పాపం షర్మిళ మర్చిపోలేకపోతోంది. అందుకే.. ఎవ్వరి రాయబారాలు అవసరం లేదని ముఖం మీదే చెప్పేసింది. తన రాజకీయ జీవితాన్ని తానే నిర్మించుకోవాలని అనుకుంటున్నానని తాను ఏం చేస్తున్నానో తనకి బాగా తెలుసని చెప్పింది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ సాయపడలేదని.. అప్పుడు రాని రాయబారం ఇప్పుడెందుకు వచ్చింది అని ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.