Viral News: లాట‌రీలో ఒకేసారి రూ.14 వేల కోట్లు..!

Viral News: లాట‌రీలు చాలా మంది గెలుస్తూ ఉంటారు. కాక‌పోతే రూ.30 నుంచి రూ.35 కోట్ల వ‌ర‌కు లాట‌రీ గెలుచుకున్నాడు అని వింటూ ఉంటాం. కానీ ఓ వ్య‌క్తి మాత్రం వంద‌లు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయ‌ల‌ను లాట‌రీలో గెలుచుకున్నాడు.

ఈ ఘ‌ట‌న ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో రూ.2 కోట్లు లేదా అంత‌కంటే ఎక్కువ లాట‌రీ గెలుచుకున్న వారి వివ‌రాల‌ను దాదాపు రెండు నెల‌ల పాటు ర‌హ‌స్యంగా ఉంచుతుంది. ఈరోజు సెప్టెంబ‌ర్ నెల‌లో లాట‌రీలో కోట్లు గెలుచుకున్న వ్య‌క్తి గురించి బ‌య‌ట‌పెట్టింది. ఆ వ్య‌క్తి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.14,000 కోట్లు గెలుచుకున్నాడు. అంటే అమెరిక‌న్ క‌రెన్సీలో 1.6 బిలియ‌న్ డాల‌ర్లు. ఇది అమెరికాలో నాలుగో అతిపెద్ద లాట‌రీ గెలుప‌ట‌. అంత‌కుముందు కూడా ఇంత మొత్తంలో ఓ ముగ్గురు లాట‌రీ గెలుచుకున్నారు.