Payal Ghosh: “ఇక్క‌డెందుకు దుస్తులు మార్చుకుంటున్నావ్ అని తార‌క్ తిట్టారు”

Payal Ghosh:  ఊస‌ర‌వెల్లి (oosaravelli) సినిమాలో త‌మ‌న్నా (tamanna) ఫ్రెండ్‌గా న‌టించిన పాయ‌ల్ ఘోష్‌.. ఇప్పుడు సినిమాలు లేక మాటి మాటికీ ఎన్టీఆర్‌ను (jr ntr) ట్యాగ్ చేస్తూ పాపుల‌ర్ అవ్వాల‌ని చూస్తోంది. ఏదో ఒక వంక‌తో తార‌క్ ట్విట‌ర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వాల‌ని చూస్తున్న పాయ‌ల్ ఇప్పుడు తార‌క్ గురించి మ‌రో ట్వీట్ చేసింది. ఊస‌ర‌వెల్లి సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జ‌రుగుతుండ‌గా.. తాను దుస్తులు రోడ్డు ప‌క్క‌న మార్చుకుంటుంటే తార‌క్ వ‌చ్చి ఎందుకు ఇక్క‌డ మార్చుకుంటున్నావ్ అని మండిప‌డ్డార‌ని.. సౌత్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు చాలా రెస్పెక్ట్ ఇస్తార‌ని ట్వీట్ చేసింది. పాపం ఎన్ని ట్వీట్స్ చేసినా ఈమెకు తెలుగులో అవ‌కాశాలు మాత్రం రావ‌డంలేదు.