Covid: హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కోవిడ్.. కొత్తగా ఐదు కేసులు
Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో మరో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన 11 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. కోవిడ్ సోకిన వారిని నిలోఫర్ హాస్పిటల్‌లోని ఓ స్పెషల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో 20 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. దాంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కోవిడ్‌పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.