Divorce: సోదరుడికి కిడ్నీ దానం.. విడాకులిచ్చిన భర్త
Divorce: ఇంత కంటే దారుణ ఘటన మరొకటి ఉండదు. తన తమ్ముడికి కిడ్నీ దానం చేసిందని ఆమెకు విడాకులు ఇచ్చాడు భర్త. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. బైరియాహి ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన తమ్ముడి పరిస్థితి చూడలేక చలించిపోయింది. కిడ్నీ మార్పిడి చికిత్స చేయకపోతే బతకడని వైద్యులు చెప్పారు. దాంతో తన కిడ్నీ ఇవ్వాలనుకుంది. వైద్యులను సంప్రదిస్తే కిడ్నీ మ్యాచ్ అయినట్లు తెలిసింది.
దాంతో వెంటనే కిడ్నీ దానం చేసేసింది. ఆపరేషన్ అయ్యాక సౌదీ అరేబియాలో ఉంటున్న తన భర్తకు వాట్సాప్లో మెసేజ్ చేసింది. దాంతో అతను షాకయ్యాడు. తనని అడగకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు అదే వాట్సాప్లో ట్రపుల్ తలాక్ చెప్పేసాడు. దాంతో ఆ మహిళ నిస్సహాయ స్థితిలో స్థానిక కోర్టును ఆశ్రయించింది.