Darshan: “ఇది మా అడ్డా.. స‌లార్ వ‌స్తే మాకేంటి భ‌యం?”

Darshan: క‌న్న‌డ‌ న‌టుడు దర్శ‌న్ ప్ర‌భాస్ (prabhas) న‌టించిన స‌లార్ (salaar) సినిమాపై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన స‌లార్ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. అయితే వారం వ్య‌వ‌ధిలోనే ద‌ర్శ‌న్ న‌టించిన కాటేరా (kaatera) కూడా విడుద‌ల కానుంది. స‌లార్ లాంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న‌ప్పుడు ఇత‌ర సినిమాల‌ను రిలీజ్ చేయ‌డానికి ధైర్యం చేయ‌రు క‌దా అని ద‌ర్శ‌న్‌ను ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న చెలరేగిపోయారు. “” ఇది మా అడ్డా. వారి సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అవుతున్నాయి. అలాంట‌ప్పుడు వాళ్లు భ‌య‌ప‌డాలి కానీ మాకెందుకు భ‌యం. త‌గ్గితే వారు త‌గ్గాలి కానీ మేమెందుకు త‌గ్గాలి “” అని అభిప్రాయ‌ప‌డ్డారు.