RGV: “నాకు చంద్ర‌బాబంటే ర‌స‌గుల్లా కంటే ఎక్కువ ఇష్టం”

Vyooham Trailer: త‌న‌కు చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అంటే కోపం లేద‌ని.. ఆయ‌నంటే ర‌స‌గుల్లా కంటే ఎక్కువ ఇష్ట‌మ‌ని అన్నారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ (RGV). ఆయ‌న డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా సెకండ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర నుంచి.. వివేకానంద రెడ్డి హ‌త్య కేసు వ‌ర‌కు ఏ ఒక్క విష‌యాన్ని కూడా వ‌ద‌ల‌కుండా సినిమాలో చూపించాన‌ని అన్నారు.