Empty Stomach: పరగడుపున ఏవి తింటే మంచిది?
Empty Stomach: కొన్ని రకాల ఆహారాలను పరగడుపున తింటేనే మంచి పోషకాలు అందుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
నానబెట్టిన నట్స్ (soaked nuts)
రాత్రి వేళలో నానబెట్టిన బాదం, కిష్మిష్, వాల్నట్స్ వంటివి ఉదయాన్నే పరగడుపున తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. డైటింగ్‌లో ఉన్నవారికి.. బరువు తగ్గాలనుకనేవారికి ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లా పనిచేస్తుంది.
బొప్పాయి (papaya)
బొప్పాయి పండును కూడా ఉదయాన్నే పరగడుపున తినొచ్చట. ఇది తినడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గి అరుగుదల బాగుంటుంది. మలబద్ధకం కూడా పూర్తిగా నయమవుతుంది.
కరగాయల రసం (vegetable juice)
పరగడుపున పండ్ల రసాలు తాగకూడదు. కానీ కూరగాయల రసం బెస్ట్. అందులోనూ కీరాదోస రసం, క్యారెట్, బీట్‌రూట్ రసం ఇంకా మంచివి. ఇది శరీరంలోని విష మలినాలను దూరం చేస్తుంది.
సోంపు నీళ్లు (fennel seed water)
రాత్రి నానబెట్టుకున్న సోంపు నీళ్లను ఉదయాన్నే తాగినా మంచిదే. ఈ నీళ్లు సులువుగా అరిగేలా చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
అరటిపండ్లు (banana)
ఉదయాన్నే జిమ్‌కి వెళ్లేవాళ్లు ఎక్కువగా అరటి పండ్లపైనే ఆధారపడతారు. ఉదయాన్నే ఒకటి లేదా రెండు అరటి పండ్లు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.