Healthy Heart: ఈ లక్షణాలు కనిపిస్తే గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే..!
Healthy Heart: మన శరీరంలో కనిపించే లక్షణాలు అనారోగ్యానికే కాదు కొన్ని ఆరోగ్యంగా ఉన్నామని కూడా తెలియజేస్తుంటాయి. గుండె సమస్యలు, కిడ్నీ సమస్య, కాలేయ సమస్య.. ఇలా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు ఎలా ఉందో కొన్ని లక్షణాలు చెప్పేస్తుంటాయి. అదే విధంగా కొన్ని లక్షణాలు మన గుండె ఆరోగ్యంగా ఉందో లేదో కూడా చెప్పేస్తాయి. ఆ లక్షణాలు ఏంటంటే..
*మీరు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీ హార్ట్ రేటు నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నప్పుడు హార్ట్ రేట్ ఇలాగే కొనసాగాలి. ఇలా ఉంటే మీ గుండె పదిలంగా ఉందని అర్థం.
*మీకు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోతే కూడా మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. మీరు నడుస్తున్నా.. నిదానంగా పరిగెడుతున్నా కూడా మీకు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. (healthy heart)
*రోజంతా ఉత్సాహంగా ఉంటున్నారా.. లేదా సాయంత్రానికి నీరసించిపోతున్నారా? అంటే మీరు విపరీతమైన శారీరక శ్రమ చేస్తుంటే అలిసిపోవడం వేరు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అలిసిపోవడం వేరు. ఒకవేళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా మీరు ఉత్సాహంగా ఉంటే మీ గుండె మీ మాట వింటోందని అర్థం.
*ఒకవేళ మీకు నీరసంగా ఉన్నా కూడా వ్యాయామం చేయగలుగుతున్నారనుకోండి.. మీ గుండె ఆరోగ్యంగా ఉంటే ఆ నీరసం కూడా ఇట్టే వదిలిపోతుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? సింపుల్.. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది కాబట్టి అన్ని అవయవాలకు సరైన ఆక్జిజన్ అందుతుంది. అప్పుడు మీకు నీరసం ఉన్నా పోతుంది. మళ్లీ ఎనర్జిటిక్ అయిపోతారు. (healthy heart)
*ఇప్పటివరకు మీకు ఎలాంటి ఛాతి నొప్పి కానీ ఊపిరి పీల్చుకోవడంలో కానీ ఇబ్బంది లేకపోయినా మీ గుండె గట్టిది అని అర్థం.