9 విషపూరిత లోహాలతో ఏర్పడిన ఏకైక విగ్రహం
Palani Murugan: మన హిందూ ఆలయాల్లోని విగ్రహాలు కొన్ని స్వయంభు అయితే మరికొన్ని మాత్రం ప్రాణ ప్రతిష్ఠ చేసినవి. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలను వివిధ లోహాలు, రాళ్లతో ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు.
అయితే భారతదేశం మొత్తంలో 9 విషపూరిత లోహాలతో తయారైన ఏకైక విగ్రహం పళని మురుగన్ విగ్రహం. తమిళనాడులోని కుళంతాయ్ వేళప్పార్ ఆలయంలో ఉంది ఈ విగ్రహం. ఈ ఆలయంలో మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి) కొలువై ఉన్నారు. బోగార్ అనే మహర్షి మురుగన్కి అమిత భక్తుడు. 18వ శతాబ్దంలో మురుగన్ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసారు. ఆ సమయంలో బోగార్ మురుగన్ విగ్రహాన్ని 9 విషపూరితమైన లోహాలతో తయారుచేసినట్లు పురాణాలు చెప్తున్నాయి.
కానీ విచిత్రం ఏంటంటే..మురుగన్ విగ్రహానికి అభిషేకం చేసిన పాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. ఈ పాలు నయం అవ్వని వ్యాధులను కూడా నయం చేయగలుగుతుందట. రాత్రి వేళల్లో స్వామివారికి గంధం రాసి తుడవకుండా వదిలేస్తారట. ఉదయానికి ఆ గంధం రాసుకుంటే వ్యాధులను నివారిస్తుందని భక్తులు చెప్తుంటారు. తమిళనాడు అంటేనే ఆలయాలకు పెట్టింది పేరు. మీరు ఎప్పుడైనా తమిళనాడుకి వెళ్లినట్లైతే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి.