Google Maps: ఇక పెట్రోల్, డీజిల్ కూడా ఆదా చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
Google Maps: గూగుల్ మాప్స్ ద్వారా ఇక మీ వాహన పెట్రోల్, డీజిల్‌ను కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌లో ఎప్పటి నుంచో ఉంది కానీ అమెరికా, యూరప్, కెనడా దేశాల్లో మాత్రమే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దీనిని ఇండియాలో కూడా ఎనేబుల్ చేసారు. ఈ ఫీచర్ ద్వారా మీ పెట్రోల్, డీజిల్ వేస్ట్ అయిపోకుండా ఉండేలా మీరు వెళ్లాల్సిన గమ్యం చేరేలా చేస్తుంది. దీనిని మీ గూగుల్ మ్యాప్స్‌లో ఇలా ఎనేబుల్ చేసుకోండి.
మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి
ప్రొఫైల్ పిక్చర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
సెట్టింగ్స్‌లోకి వెళ్లి నావిగేషన్‌పై క్లిక్ చేయండి
స్క్రోల్ చేస్తే రూట్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది
ప్రిఫర్ ఫ్యుయెల్ – ఎఫీషియెంట్ రూట్స్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి
ఆ తర్వాత ఇంజిన్ టైప్‌లో మీ వాహనం ఇంజిన్ని సెలెక్ట్ చేసుకోండి
ఆ తర్వాత మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంటర్ చేయండి
ఇలా చేయడం ద్వారా మీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి త్వరగా చేర్చడంతో పాటు పెట్రోల్, డీజిల్‌ను కూడా ఆదా చేస్తుంది. అయితే మీరు ఇంజిన్ టైప్ సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇండియాలో దాదాపు అన్ని వాహనాలు పెట్రోల్‌తో నడుస్తాయి. మీరు ఇంజిన్ టైప్ సెలెక్ట్ చేసుకోకపోతే మీది డీజిల్ బండి అయినా అది ఆటోమేటిక్‌గా పెట్రోల్ సెలెక్ట్ చేసుకుంటుంది.