Liver: కాలేయం పాడైతే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. అప్రమత్తంగా ఉండండి
Liver: కొన్ని అనారోగ్య సమస్యలు ఓ పెద్ద సమస్యకు లక్షణాలు కావచ్చు. ఇక భరించే ఓపిక లేక వైద్యుల దగ్గరికి వెళ్తే తప్ప అది ప్రమాదకరమైన జబ్బు అని మనకు తెలీదు. ముఖ్యంగా కాలేయం విషయంలో ఈ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇటీవల CID అనే సీరియల్లో నటించిన దినేష్ ఫడ్నిస్ (dinesh phadnis) కాలేయం పావడవడంతోనే చనిపోయారు. దాంతో లివర్ పాడవుతున్నప్పుడు కనిపించే కొన్ని లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు అని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను నివారించడం కష్టమే కానీ అవి ప్రమాదకరం కాకుండా చూసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది.
కాలేయం పాడయ్య ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు మనిషి మెదడు కూడా పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు.
రక్తం గడ్డ కడుతూ ఉంటుంది. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. (liver)
కళ్లు పసుపు రంగులోకి మారిపోవడం.. మూత్రం మరీ పచ్చగా రావడం
చర్మం కూడా పసుపు రంగులోకి పాలిపోతుంటుంది.
తరచూ కడుపు నొప్పిగా అనిపించినా కాలేయ పనితీరు దెబ్బతింటున్నట్లు అర్థం. కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే అది కాలేయం ఉబ్బిందనడానికి సూచకం.
కాలేయ సమస్యలు ఉన్నవారికి వైద్యం, మందులతో నయం అయ్యే అవకాశం ఉంది కానీ అది కాస్తా లివర్ క్యాన్సర్‌గా మారితే మాత్రం ఏమీ చేయలేం. ఆల్రెడీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా లివర్ సమస్యలు ఉండి ఉంటే అవి ఇతర కుటుంబ సభ్యులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యులను సంప్రదించేటప్పుడు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పండి.