ఆక‌లేయడం లేదా.. క‌డుపు క్యాన్స‌ర్ ల‌క్ష‌ణం కావ‌చ్చు

Stomach Cancer: ఉన్న‌ట్టుండి ఆక‌లి లేకుండా పోతుంది. అలా ఒక రోజు రెండు రోజులు కాదు. వారాల పాటు కూడా స‌రిగ్గా తినాల‌ని అనిపించ‌దు. ఆక‌లిగా అనిపించ‌దు. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే క‌డుపు క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేనే లేదు. ఆక‌లి వేయ‌క‌పోవ‌డం అనేది కేవ‌లం క్యాన్స‌ర్ ల‌క్ష‌ణమే కాదు. దానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి.

ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చూసుకోండి

*అరుగుద‌ల స‌మ‌స్య‌లు, గుండెలో మంట‌గా ఉన్న‌ప్పుడు ట్యాబ్లెట్లు వేసుకున్నా త‌గ్గ‌క‌పోతే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

*ఆక‌లి లేకుండా నీర‌సంగా అనిపించినా అనుమానించాల్సిన అంశ‌మే.

*క‌డుపు పై భాగంలో నొప్పి తీవ్రంగా ఉన్న‌ప్పుడు.. ట్యాబ్లెట్ల‌తో త‌గ్గ‌న‌ప్పుడు

*ఏం తిన్నా కూడా వాంతులు, విరోచ‌నాలు అవుతున్న‌ప్పుడు. వాంతి చేసుకున్న‌ప్పుడు ర‌క్తం క‌నిపించినా అనుమానించాల్సిన ల‌క్ష‌ణ‌మే

*కొంచెం తిన్నా కూడా క‌డుపు బ‌రువెక్కిపోవ‌డం

*మ‌లంలో ర‌క్తం.. లేదా మ‌లం న‌ల్ల‌గా ఉంటే కూడా క‌డుపులో ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్ అవుతోంద‌ని అర్థం.

*ఈ ల‌క్ష‌ణాలు అన్నీ ఉన్న‌ప్ప‌టికీ అది కచ్చితంగా క‌డుపు క్యాన్స‌రే అవ్వాల్సిన ప‌నిలేదు. మీకు ఏ ల‌క్ష‌ణం క‌నిపించినా దానితో పాటు తీవ్ర‌మైన నీర‌సంగా అనిపించినా కూడా సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుల‌ను సంప్ర‌దించండి.