ఎంపీని స‌స్పెండ్ చేస్తే ఏమ‌వుతుంది.. గ‌తంలో ఎంత మంది స‌స్పెండ్ అయ్యారు?

Mahua Moitra: TMC ఎంపీ మ‌హువా మోయిత్రాను పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించారు. క్యాష్ ఫ‌ర్ క్వెరీ కేసులో (cash for query) మ‌హువా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఆమె స్నేహితుడు అయిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ద‌ర్శ‌న్ హీరానంద‌ని (darshan hiranandani) నుంచి డ‌బ్బులు తీసుకుని పార్ల‌మెంట్‌లో అదానీ గ్రూప్ గురించి ప్ర‌శ్న‌లు వేసేవార‌ని BJP నేత నిశికాంత్ డూబే (nishikant dubey) ఆరోపించారు. దాంతో ఆమె బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

దాంతో ఆమెపై పార్ల‌మెంట్ ఎథిక్స్ క‌మిటీ CBI విచార‌ణ చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో ఈరోజు మ‌హువాను పార్ల‌మెంట్ నుంచి స‌స్పెండ్ చేసారు. దాంతో మ‌హువా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియా ముందు గొంతు చించుకుని అరిచారు. ద‌ర్శ‌న్ అనే వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్పుడు అత‌నికి ఎలాంటి స‌మ‌న్లు జారీ చేయ‌కుండా త‌న‌ను బ‌లి చేయ‌డం ఎంత వ‌ర‌కు న్యాయం అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి పార్ల‌మెంట్‌లో ప్ర‌శ్నిస్తే త‌ప్పేముంది అని నిల‌దీసారు. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన ఈ పార్ల‌మంట్‌లో ఒక మ‌హిళా ఎంపీని బ‌హిష్క‌రించ‌డం చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి అని మండిపడ్డారు.

గ‌తంలో ఎంత మంది ఎంపీలు బ‌హిష్కృత‌మ‌య్యారు?

ఇలా ఒక ఎంపీని పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించ‌డం మొద‌టిసారేం కాదు. 2005లో UPA ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు దాదాపు 10 మంది ఎంపీల‌ను బ‌హిష్క‌రించారు. గ‌తంలో వీరు కూడా క్యాష్ ఫ‌ర్ క్వెరీ స్కాంలో భాగం కావ‌డంతో వారిని లోక్ స‌భ నుంచి తొల‌గించేవ‌ర‌కు ఊరుకోలేదు.

2005లో పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్కృత‌మైన ఎంపీలు వీరే..

న‌రేంద్ర కుమార్ కుష్వాహ‌

అన్నా సాహెబ్ ఎంకే పాటిల్

మ‌నోజ్ కుమార్

వైజీ మ‌హాజ‌న్

ప్ర‌దీప్ గాంధీ

సురేష్ చందేల్

రామ్ సేవ‌క్ సింగ్

లాల్ చంద్ర కోల్

రాజారాం పాల్

చంద్ర ప్ర‌తాప్ సింగ్

ఒక ఎంపీని స‌స్పెండ్ చేస్తే ఏమ‌వుతుంది?

సాధార‌ణంగా రెండు ర‌కాలుగా స‌స్పెన్ష‌న్ ఉంటుంది. ఒక‌టి.. పార్ల‌మెంట్‌లో అస‌భ్య‌క‌రంగా మాట్లాడితే ఛైర్‌ప‌ర్స‌న్ వారిని బ‌హిష్క‌రించే అవ‌కాశం ఉంటుంది. రెండోది ఇలా ఏవన్నా స్కాంలు ఉన్నాయ‌ని నిరూపిత‌మైతే.. ఓటింగ్ పెట్టి ఎంత మంది ఎంపీలు వ్య‌తిరేకంగా ఓటేస్తారు అనేదానిపై ఆధారప‌డి ఉంటుంది. ఇప్పుడు మ‌హువా విష‌యంలో ఇదే జ‌రిగింది. మెజారిటీ ఎంపీలు ఆమెను బ‌హిష్క‌రించాల‌ని ఓటు వేయ‌డంతో ఆమెను తొల‌గించాల్సి వ‌చ్చింది. కార‌ణం ఏదైనా ఎంపీని బ‌హిష్క‌రిస్తే ఆ సీటు ఖాళీగా ఉండిపోతుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బహిష్కృత‌మై ఎంపీ ఎన్నిక‌ల్లో గెలిస్తే అప్పుడు మ‌ళ్లీ పార్ల‌మెంట్‌లోకి ఆహ్వానం ఉండే అవ‌కాశం ఉంటుంది.