Health: ఇవి ఎప్పటికప్పుడు తినకపోతే ఆరోగ్యం గోవింద!
Health: కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తినేయాలి. అంటే మీరు ఏరోజైతే వండుకుంటారో లేదా ఏ రోజైతే మార్కెట్ నుంచి తెచ్చుకుంటారో వాటిని అదే రోజు తినేయాలట. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఇంతకీ అవి ఏ ఆహార పదార్థాల్లో తెలుసుకుందాం.
గుడ్లు (eggs)
మీరు గుడ్లు ఉడికించి పెంకులు తీసేసినప్పుడు వాటిని అప్పటికప్పుడే అదే రోజు తినేయండి. దానిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని మరుసటి రోజు తింటే చాలా డేంజర్. కావాలంటే పెంకులు తీసేసిన రెండు గంటల తర్వాత తినొచ్చు. అంతకుమించి ఎక్కువ సమయం ఉంచకండి. ఒకవేళ మీరు తినడం మర్చిపోతే దానిని పడేయటం మేలు.
మాంసం (meat)
మీరు చికెన్, మటన్ కొట్టుల నుంచి మాంసం కొట్టించుకుని తెచ్చుకున్నారనుకోండి కేవలం రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా అంతే. ఫ్రిడ్జ్‌లో ఎన్నిరోజులు ఉంచినా ఫ్రెష్‌గానే ఉంటుంది కదా అనుకుంటే మీ పొరపాటే. అందుకే తెచ్చిన రోజే వండేసుకోవడం మంచిది.
అన్నం (rice)
వండిన అన్నాన్ని కొందరు మరుసటి రోజు వరకు పెట్టుకుని తింటుంటారు. ఇంకొందరైతే ఈరోజు ఉదయం వండిన అన్నాన్ని రేపు ఉదయం వరకు పెట్టుకుని చద్దన్నం అనుకుని తినేస్తుంటారు. చాలా మంది చేసే పొరపాటు ఇదే. చద్దన్నం అంటే రాత్రి లేదా సాయంత్రం వండుకుని అందులో పాలు పెరుగు ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఉదయం తినాలి. అంతేకానీ ఈరోజు ఉదయం వండినది రేపు ఉదయం తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.
దోసపండు (muskmelon)
దోసపండుని కూడా ఎప్పటికప్పుడు తినేయాలి. దీనిని ఒక రోజు పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా మంచిది కాదట. ఇలా చేస్తే సాల్మోనెల్లా, లిస్టీరియా అనే పాథోజెనిక్ బ్యాక్టీరియా సోకి పాడైపోతుందని వైద్యులు చెప్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. సగం కట్ చేసిన దోస పండు కానీ దోస పండు ముక్కల్ని కానీ కొనుక్కోవద్దు. నేరుగా కట్ చేయని పండునే కొనుక్కోండి.