Payal Ghosh: గంభీర్ నా వెంట పడ్డాడు కానీ నేను ఇర్ఫాన్ పఠాన్‌ను ప్రేమించా
Payal Ghosh: ఊసరవెల్లి, ప్రయాణం వంటి సినిమాల్లో నటించిన నటి పాయల్ ఘోష్. ఆ తర్వాత ఆమెకు సినిమాలు లేకుండాపోయాయి. దాంతో ఏదో ఒక వంకతో కావాలని ఎన్టీఆర్‌ను (jr ntr) ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంటుంది. ఈ రకంగా అయినా పబ్లిసిటీ వస్తే తనకు అవకాశాలు రాకపోవా అని ఆమె ఆశ.
ఇప్పుడు ఏకంగా క్రికెటర్లు గౌతమ్ గంభీర్ (gautam gambhir), ఇర్ఫాన్ పఠాన్‌ల (irphan pathan) గురించి షాకింగ్ ట్వీట్స్ చేసింది. గతంలో గౌతమ్ గంభీర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లు (akshay kumar) తనకు లైన్ వేసారని.. కానీ తను మాత్రం ఇర్ఫాన్ పఠాన్‌నే నిజాయతీగా ప్రేమించానని ట్వీట్‌లో పేర్కొంది. తాను ఇర్ఫాన్ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నామని కానీ ఇర్ఫాన్ తనను మోసం చేసి వేరే నటిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది.
గౌతమ్ గంభీర్ తనకు మాటి మాటికీ కాల్స్ చేస్తుంటే ఇర్ఫాన్ రోజూ తన ఫోన్ లిస్ట్ చెక్ చేసేవాడని ఈ విషయం హార్దిక్, కృణాల్ పాండ్యలకు కూడా తెలుసని పేర్కొంది. పాయల్ ఇంతటితో ఆగలేదు.. తాను ఇర్ఫాన్ కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. పైగా ఇర్ఫాన్ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేస్తోంది. దాంతో ఇర్ఫాన్, గంభీర్ ఫ్యాన్స్ ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇర్ఫాన్ వల్ల తను డిప్రెషన్‌లోకి వెళ్లాలని సినిమాలు కూడా చేయలేకపోయానని తెలిపింది. ఇప్పటికీ డిప్రెషన్ మందులు వాడుతున్నానని తన గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని మండిపడుతోంది పాయల్.