ఈ ఆల‌యంలో దేవ‌తా మూర్తులు క‌బుర్లు చెప్పుకుంటార‌ట‌..!

Spiritual: ఆల‌యాల్లో ప్రాణ ప్ర‌తిష్ఠ చేసే ప్ర‌తీ విగ్ర‌హానికి ఎంతో శ‌క్తి ఉంటుంది. అవి కేవ‌లం రాళ్లు మాత్రమే కాదు. వాటికి ఉండే ప‌వ‌ర్ వేరు. మ‌న‌కు తెలీని శ‌క్తులు క‌లిగి ఉంటాయి అని చెప్ప‌డానికి శ్రీరాజ రాజేశ్వ‌రి త్రిపుర ఆల‌య‌మే నిదర్శ‌నం.

బిహార్‌లోని బ‌క్స‌ర్ జిల్లాలో ఉన్న ఈ ఆల‌యంలో అమ్మ‌వారు త్రిపుర‌, ధూమావ‌తి, భ‌గ‌ల‌ముఖి, తారా, కాళి, చిన్నమ‌స్త‌, శోడ‌సి, మాతంగి, క‌మ‌ల‌, ఉగ్ర‌, భువ‌నేశ్వ‌రి రూపాల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఓ తాంత్రికుడు 400 ఏళ్ల క్రితం ఈ ఆల‌యాన్ని నిర్మించాడ‌ని స్థానికులు చెప్తుంటారు. ఈ ఆల‌య ప్ర‌త్యేకత ఏంటంటే.. ఇక్క‌డ ఉండే అమ్మ‌వారి విగ్ర‌హాలు ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకుంటూ ఉంటాయ‌ట‌. ఆల‌య వైపు నుంచి వెళ్ల‌టేప్పుడు ఎవ‌రో మాట్లాడుకుంటున్న‌ట్లు వినిపిస్తుంద‌ట‌. ఆ మాట‌లు అర్థంకావు.

అస‌లు ఆల‌యంలో ఎవ‌రైనా రాత్రి వేళ‌ల్లో నిద్రిస్తున్నారేమో వారి మాట‌లే ఇలా విన‌ప‌డుతున్నాయేమో అనుకుని కాపలా కాసేవారు. కానీ ఎవ్వ‌రూ ఆల‌యంలోకి వెళ్లిన‌ట్లు అనిపించ‌లేదు. కొంద‌రు శాస్త్రవేత్త‌లు కూడా ఆ మాట‌లు ఎవ‌రివో తెలుసుకునేందుకు య‌త్నించారు వారి వ‌ల్ల కూడా కాలేదు. అమ్మ‌వారి రూపాలే ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకుంటున్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు.