KJ George: తెలంగాణలో కాంగ్రెస్ వ‌స్తే.. క‌ర్ణాట‌క‌కు ఎక్కువ క‌రెంట్ ఇస్తాం

KJ George: కర్ణాటక విద్యుత్ మంత్రి జార్జ్ సంచలన వాఖ్యలు చేసారు. కర్ణాటక బడా పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో కర్ణాటకలో విద్యుత్ ఇబ్బంది ఉంది కాబట్టి తెలంగాణ నుండి తీసుకుందాం అని వారితో అన్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ జెన్‌కోతో ఒప్పందం చేసుకొని పరిశ్రమలకు ఎక్కువ గంటలు కరెంట్ ఇస్తామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారింది.