Kavitha: సీఎం అవ్వాల‌ని ఉందా.. క‌విత తెలివైన ఆన్స‌ర్

Kavitha: క‌ల్వ‌కుంట్ల క‌విత గ‌త ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు. దాంతో ఆమెకు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చారు. అయితే ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఈసారి ఎన్నిక‌ల్లో కచ్చితంగా BRS పార్టీనే గెలుస్తుంద‌ని అందులో సందేహ‌మే లేద‌ని అన్నారు. అయితే ఒక‌వేళ పార్టీ గెలిస్తే సీఎంగా KCR కాకుండా మ‌రెవ‌రినైనా నియ‌మించాల‌ని అనుకుంటే KTRని నియ‌మిస్తారా లేక క‌వితనా అని అడిగిన ప్ర‌శ్న‌కు క‌విత తెలివిగా స‌మాధానం ఇచ్చారు. త‌ను ఇంకా రాజ‌కీయాల్లో జూనియ‌ర్ అని సీఎం ప‌ద‌విని ఇప్ప‌టినుంచి ఆశించేంత లేద‌ని తెలిపారు. ఇప్ప‌టికైతే మంత్రి ప‌ద‌విని గెలిస్తే అంతే చాల‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. KCR కాకుండా ఇంక ఎవ‌రినైనా సీఎంను నియమించాలన్న ఆలోచ‌న వ‌స్తే ఆయనకు ఎవ‌రిని న‌చ్చితే వారిని నియ‌మిస్తార‌ని వెల్ల‌డించారు.